మేరు పర్వతం
అహంభావం...ఆడంబరం....
అసహనం...ఆక్రోశం ...
ఇటువంటి దుర్గుణాలకు ఆమడ దూరంగా,
ఆత్మీయత...ఆలింగన...
ఆప్యాయత...అనురాగాలకు చెంతనే ఉండే వ్యక్తి ఎవరంటే .....
డా.పర్వతనేని సుబ్బా రావు గారని చెప్పుకోవాలి.
నా గురువర్యులు ఆచార్య పర్వతనేని సుబ్బా రావు గారితో నాకు 15 ఏళ్ళ అనుబంధం. నేను ఎం.ఏ.తెలుగు, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పూర్తిచేసి,జే.ఆర్.ఎఫ్.ఫెలోషిప్ పొందాక పిహెచ్ .డి. టాపిక్ ఎంపికలో నాకు స్వేచ్ఛ నిచ్చే చోట పిహెచ్.డి.చెయ్యాలని నిర్ణయించు కొని స్న్నేహ శీలి శ్రీ భిక్షలయ్య పరిచయంతో డా.పర్వతనేని సుబ్బారావు గారిని కలిశాను.ఆచార్య ఆత్రేయ సినీ సాహిత్యం పై నాకున్న పరిశోధనా జిజ్ఞాసను తెలియ చేశాను.మాస్టారు నా అభిరుచిని,ఆశను గ్రహించి చిరునవ్వుతో నన్ను తన స్కాలర్ గా స్వీకరించారు. ఈ విధంగా 1995 లో నా పరిశోధన ప్రారంభమైనది.
తన విద్యార్థులు డబ్బులు పొడుపు లేకుండా ఖర్చుపెట్టడం చూస్తూ మాస్టారు ఊరుకునేవారు కాదు. హెచ్చరిస్తారు. దీనికొక ఉదాహరణ. "ఆత్రేయ సాహిత్యం - ఒక పరిశీలన" అని ఫీల్డ్ వర్క్ లేని టాపిక్ ను మొదట నేను ఎంచుకొని...
ఆ తర్వాత "ఆచార్య ఆత్రేయ సినిమా సంభాషణలు-ఒక పరిశీలన"అనే అంశంపై పిహెచ్.డి చెయ్యాలని అనుకొని నా నిర్ణయాన్ని చెబితే."ఫీల్డ్ వర్క్ కే నీ ఫెలో షిప్ అంతా ఖర్చుపెట్టాల్సి ఉంటుందమ్మా.మరోసారి టాపిక్ గూర్చి మరోసారి ఆలోచించుకో"అని ఆత్మీయునిలా జాగ్రత్తలు చెప్పారు. సంతోషాన్ని పంచుకోవాల్సిన సందర్బాలలో ఏదైనా స్వీట్ కొనుక్కొని వెళ్ళినా "ఎందుకమ్మా డబ్బులు వృధా చేస్తారు."అని సున్నితంగా ఆప్యాయాన్ని రంగరించి చెప్పేవారు. డబ్బు విలువను ప్రతి సందర్బంలోను యువకులుగా ఖర్చుపెట్టే స్కాలర్స్ కు తండ్రిలా చెప్పే వారు.
కొన్ని యూనివర్సిటీస్ లో J.R.F. స్కాలర్స్ ను కొంతమంది గైడ్లు కొన్ని రకాల ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారని నా తోటి స్చొలర్స్ చెప్పుకోవడం విన్నాను. కాని మా గురువర్యుల విషయంలో మేము పుణ్యాత్ము లమని చెప్పుకోవాలి.ఏ సందర్భంలోనూ ఇబ్బందిపెట్టిన దాఖలా లేదు. అంత మంచి గైడు
ఈ లోకలో చాలా మంది కులాన్ని బట్టో ,ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని బట్టో ...ఆస్తిపాస్తుల్ని బట్టో ఇలా రకరకాల వాటిని బట్టి అహంభావంతో...గర్వంతో వ్యవహరిస్తుంటారు. కాని పైన చెప్పినవన్నీ ఉన్నా మాస్టారు కాస్తంత గర్వాన్ని కూడా కూడ ఎక్కడా ప్రదర్శించలేదు. మాస్టార్ని గమనిస్తే ఒకటే అనిపిస్తుంది. పరిశోధకులకు మాస్టారు గైడు మాత్రమే కాదు. విద్యార్థుల జీవితాలకు మార్గదర్శి. అందరితో మర్యాదగా నడుచుకునే విధానం,నిగర్విగా నడుచుకోవడం,లోకంకోసం గొప్పలకు పోనక్కరలేదు..అనే ఇటువంటి విషయాలెన్నో విద్యార్దులు మాస్టారు నుంచి నేర్చుకోవచ్చు. ఇటువంటి వ్యక్తిత్వమే మాస్టారుని మంచి ఆరోగ్య వంతునిగా నడిపింప జేస్తుంది అనిపిస్తుంది.
మాస్టారికి కీర్తి కాంక్షలు లేవు.భాష-సాహిత్య అంశాలపట్ల వారికున్న పరిజ్ఞానాన్ని పుస్తక రూపంలో విద్యార్థులకు పంచవచ్చు. కాని కీర్తి కోసం గురువుగారు ఏ పుస్తకాన్ని రాయలేదు. రాసినవి కొన్నైనా గొప్ప రచనలు. మాస్టారు గొప్ప ఆచార్యులు,వ్యక్తి,విజ్ఞాని గానే కాకుండా గొప్ప వక్తకూడా. పామరులకు సైతం తేలికగా అర్థమయ్యేలా మాట్లాడ గలిగే వక్త. మాస్టారు గూర్చి నేను చాలా రోజుల క్రితం రాసిన సాహితీ హైకూ ఈ సందర్భంగా గుర్తుకొస్తుంది.

పర్వతనేని...;
వ్యక్తిత్వంలో
మేరు పర్వతం!
No comments:
Post a Comment